- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IBOMMA: వైజాగ్ టూ కరేబియన్.. పైరసీతో వందల కోట్లు.. విచారణలో బయటపడ్డ సంచలనాలు?
సినిమాలు, వెబ్ సిరీస్‌లు పైరసీ చేస్తూ IBOMMA వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్న ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా సైబర్ క్రైం పోలీసులు అతడి నుండి సంచలన విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది. కరీబియన్ దీవుల్లో ఉంటూ వెబ్ సైట్ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి స్వస్థలం విశాఖపట్నంగా పోలీసులు గుర్తించారు.

దిశ, వెబ్ డెస్క్: సినిమాలు, వెబ్ సిరీస్‌లు పైరసీ చేస్తూ IBOMMA వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్న ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా సైబర్ క్రైం పోలీసులు అతడి నుండి సంచలన విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది. కరీబియన్ దీవుల్లో ఉంటూ వెబ్ సైట్ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి స్వస్థలం విశాఖపట్నంగా పోలీసులు గుర్తించారు. కూకట్‌పల్లిలో అతడు పట్టుబడిన అపార్ట్‌మెంట్‌లో పలు సినిమాలకు సంబంధించిన హార్డ్ డిస్క్‌లు, కొన్ని సినిమాల హెచ్‌డీ ప్రింట్‌లు, కంప్యూటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
అప్ లోడ్ చేయడానికి రెడీగా ఉన్న కొన్ని సినిమాలను హోల్డ్ లో పెట్టినట్టు కూడా గుర్తించారు. అతడి బ్యాంకు ఖాతాలో రూ.3 కోట్లు ఉండగా, పైరసీ ద్వారా అతడు తక్కువ కాలంలోనే వందల కోట్లు సంపాదించినట్టు విచారణలో తేలింది. అతిత్వరలనే వెబ్ సైట్ ను పూర్తిగా క్లోజ్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఇమ్మడి రవిని విచారించి కోర్టులో హాజరుపరచగా మరో రెండు రోజుల పాటు దర్యాప్తు జరిపి పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు ఐబొమ్మ వెనుక రవి ఒక్కడే ఉన్నాడా.. ఇంకా ఎవరెవరు ఉన్నారు.. నెట్ వర్క్ ఎక్కడెక్కడ ఉంది అనే విషయాలపై పోలీసులు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.






