- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ టాస్క్ ఫోర్స్ DCP రాధాకిషన్ రావుకు షాక్.. తాజాగా మరో ఛార్జ్‌షీటు దాఖలు
పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమే సృష్టించింది.

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమే సృష్టించింది. ఈ కేసులో పలువురు సీనియర్ పోలీసు అధికారులు ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలోనే వివిధ పార్టీ రాజకీయ నాయకులు, సెలబ్రిటీల ఫోన్ ట్యాపింగ్‌లో అత్యంత కీలకంగా వ్యవహరించిన నాటి మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు (Radhakishan Rao)కు మరో బిగ్ షాక్ తగిలింది.
హైదరాబాద్ నగర పరిధిలోని సనత్‌నగర్ (Sanath Nagar)లో తమ ఫ్లాట్‌ను బెదిరించి దౌర్జన్యంగా రాయించుకున్నారని రాధాకిషన్ రావుపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై వచ్చిన అభియోగాలపై విచారణ చేపట్టిన సనత్‌నగర్ పోలీసులు ఇవాళ కూకట్‌పల్లి కోర్టులో ఛార్జ్‌షీటు దాఖలు చేశారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ సమాచారం ఆధారంగా రాజకీయ ఒత్తిడితో వ్యాపారవేత్తలు, సెలబ్రిటీల నుంచి భారీ మొత్తంలో వసూళ్లు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధాకిషన్ రావుపై తాజాగా మరో ఛార్జ్‌షీటు దాఖలు అవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.






