- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిల్లల కోసం టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌కు వెళ్లిన దంపతులకు షాక్..వేరే వ్యక్తి వీర్యకణాలతో గర్భం
by Ajay Maddhiboyina |
సికింద్రాబాద్‌లోని ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పిల్లల కోసం వెళ్లిన ఓ జంటకు డాక్టర్లు షాక్ ఇచ్చారు. చాలా కాలంగా పిల్లలు పుట్టడం లేదని ఓ జంట టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌కు వెళ్లింది.

X
దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్‌లోని ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పిల్లల కోసం వెళ్లిన ఓ జంటకు డాక్టర్లు షాక్ ఇచ్చారు. చాలా కాలంగా పిల్లలు పుట్టడం లేదని ఓ జంట టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌కు వెళ్లింది. తన భర్త వీర్య కణాలతో సంతానం కలిగించాలని మహిళ కోరగా, వైద్యురాలు వేరే వ్యక్తి వీర్య కణాలతో గర్భం దాల్చేలా చేసింది. అనుమానం వచ్చిన మహిళ డీఎన్ఏ పరీక్ష చేసుకోగా అది తన భర్త డీఎన్ఏతో మ్యాచ్ అవ్వలేదు. శిశువు డీఎన్ఏ వేరుగా ఉండటంతో దంపతులిద్దరూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆ సెంటర్‌పై పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం.
Next Story






