సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి.. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్‌రెడ్డి

by Sathputhe Rajesh |   (  Updated:2023-12-07 09:47:13  IST  )

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది.

సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి.. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అధికార మార్పిడి జరగ్గానే ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆరు గ్యారంటీల ఫైల్‌పై తొలి సంతకం, దివ్యాంగ యువతి రజనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే పైల్ ‌పై సంతకం చేయగా అధికారుల బదిలీల ప్రాసెస్ మొదలైంది. తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్‌రెడ్డిని, సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా వి.శేషాద్రిని నియమిస్తూ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు. రానున్న రోజుల్లో మరిన్ని కీలక బాధ్యతల్లో అధికారుల నియామకం జరగనున్నది.

Next Story