రెవెన్యూ రికార్డుల్లో స్వాధీనం.. గ్రౌండ్ లో షాలినీ అధీనం.!

by Bhanu |

రూ.కోట్ల విలువ చేసే అసైన్డ్ భూమిని కొనుగోలు చేయడం తప్పని తెలిసినా విద్యాసంస్థల యాజమాన్యం ఆ భూమిని వదులుకునేందుకు

రెవెన్యూ రికార్డుల్లో స్వాధీనం.. గ్రౌండ్ లో షాలినీ అధీనం.!
X


కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ రెవెన్యూ గ్రామ శివారులోని షాలిని(జ్యోతిస్మతి ఇంజినీరింగ్ కాలేజి) విద్యాసంస్థల యాజమాన్యం చట్టవిరుద్ధంగా (పీవోటీ-1977) సర్వే నం. 574, 576లోని 15.17 ఎకరాల అసైన్డ్ భూమిని ఆక్రమించుకుంది. దీంతో స్థానికంగా విమర్శలు వ్యక్తమై ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ అవసరాలకు వాడుకోవాలంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన అప్పటి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ఆదేశాలు జారీ చేయగా అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించారు. అందుకు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాల్సి ఉండగా కేవలం రికార్డుల్లో మాత్రం స్వాధీనం చేసుకున్నట్టుగా తమ అకౌంట్లో డిపాజిట్ చేసుకుని మోకాపై విద్యాసంస్థ కబ్జాకు వదిలేశారు. దీంతో రూ.కోట్ల విలువ చేసే అసైన్డ్ భూమిని స్వాధీనం చేసుకోవడంలో అధికారులు విఫలం చెందారు. అసైన్డ్ భూములను కొనుగోలు చేయడం తప్పని తెలిసినా విద్యాసంస్థల యాజమాన్యం ఆ భూమిని వదులుకునేందుకు మీనమేషాలు లెక్కిస్తోంది. అసైన్డ్ భూమిని ఏళ్ల తరబడి అనుభవిస్తూ పట్టా భూమిలా వ్యవహరిస్తుండడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ భూమిని అధికారులు స్వాధీనం చేసుకుంటారా? లేక సంది కుదుర్చుకున్నారా? అనే సందిగ్ధం వ్యక్తం అవుతోంది. అయితే అధికారులు కాలయాపన చేయడంలో కారణమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

దిశ బ్యూరో, కరీంనగర్ : రూ.కోట్ల విలువ చేసే అసైన్డ్ భూమిని కొనుగోలు చేయడం తప్పని తెలిసినా విద్యాసంస్థల యాజమాన్యం ఆ భూమిని వదులుకునేందుకు మీనమేషాలు లెక్కిస్తునే అసైన్డ్ భూమిని ఏళ్ల తరబడి అనుభవిస్తూ పట్టా భూమిలా వ్యవహరిస్తున్నారు. అసైన్డ్ భూమి ఆక్రమణకు గురైందని తెలిసినా అధికారులు మాత్రం రికార్డుల్లో మట్టుకు తాము స్వాధీనం చేసుకున్నట్లు చూపిస్తున్నప్పటికీ ప్రైవేటు విద్యాసంస్థకు కబ్జాకు వదిలేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకుంటారా? లేక సంది కుదుర్చుకున్నారా? అనే సందిగ్ధం వ్యక్తం అవుతోంది. అయితే అధికారుల కాలయాపనకు కారణమేంటి అని పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

15 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ రెవెన్యూ గ్రామ శివారులోని షాలిని(జ్యోతిస్మతి ఇంజినీరింగ్ కాలేజి) విద్యాసంస్థల యాజమాన్యం చట్టవిరుద్ధంగా (పీవోటీ-1977) సర్వే నం. 574, 576లోని 15.17 ఎకరాల అసైన్డ్ భూమిని ఆక్రమించుకుంది. దీంతో స్థానికంగా విమర్శలు వ్యక్తమై ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ అవసరాలకు వాడుకోవాలంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఫిర్యాదులతో స్పందించిన అప్పటి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ఆదేశాలు జారీ చేయగా అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించారు. అందుకు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాల్సి ఉండగా కేవలం రికార్డుల్లో మాత్రం స్వాధీనం చేసుకున్నట్టుగా తమ అకౌంట్లో డిపాజిట్ చేసుకుని మోకాపై విద్యాసంస్థ కబ్జాకు వదిలేశారు.

ఆపై ప్రభుత్వాలు మారడంతో తమ పలుకుబడి ఉపయోగించిన విద్యాసంస్థల యాజమాన్యం అప్పటి ప్రభుత్వంలోని పెద్దలను అడ్డుపెట్టుకుని అటువైపు కన్నేత్తి చూడకుండా కనికట్టు చేసి కబ్జాను సాగించింది. సదరు విద్యాసంస్థలకు బయపడిన అధికారులు నాటి నుంచి నేటి వరకు రికార్డుల్లో మాత్రమే ప్రభుత్వ భూమిగా చూపిస్తూ వచ్చారు. దీంతో ఎక్కడ అది ప్రైవేటు భూమిగా చూపించకపోవడంతో ఎవరికి అనుమానం రాకుండా నేటికీ తమ స్వాధీనంలో ఉంచుకున్న ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం దర్జాగా అనుభవిస్తు ఆ భూమిని వదులుకునేందుకు మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలంటు ప్రజాసంఘాలు ప్రభుత్వానికి ఫిర్యాదులతో మొరపెట్టుకున్నాయి. అయినప్పటికీ అధికారుల్లో చలనం లేకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

భూమి స్వాధీనం అయ్యేనా?

రూ.కోట్ల విలువ చేసే అసైన్డ్ భూమి స్వాధీనంపై అధికారుల వ్యవహారం అనుమానాస్పదంగా ఉంది. దీంతో సదరు ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన విద్యాసంస్థల యాజమాన్యంతో అధికారులు సందికుదుర్చుకున్నారా? లేక స్వాధీనం చేసుకుంటారా? అనే అనుమానులు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు కాలయాపనకు చేయడంలో కారణాలేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ భూమిని స్వాధీనం చేసు కోవాలంటు ప్రభుత్వానికి ప్రజా సంఘాలు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత ప్రభుత్వంలో పలుకుబడి ఉపయోగించి అధికారులను కట్టడిచేసిన సదరు విద్యాసంస్థల యాజమాన్యం ఈ ప్రభుత్వంలో సైతం అదే పంథాను సాగిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అసైన్డ్ భూమిని స్వాధీనం చేసుకోవాలి : బండారి శేఖర్, ఏఐఎఫ్‌బీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్

షాలిని విద్యాసంస్థలో అసైన్డ్ భూమిపై ప్రభుత్వ అధికారులకు మూడుసార్లు ఫిర్యాదు చేశాం. అయినా చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేంటో అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానిక తహశీల్దారును కలిసి ప్రశ్నించినా స్పందన కరువైంది. ఇప్పటికైనా షాలిని (జ్యోతిస్మతి ఇంజినీరింగ్ కాలేజి) విద్యాసంస్థ అధీనంలో ఉన్న సర్వే నంబర్ 574, 576లోని 15.17ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వ అసైన్డ్ భూమికి హద్దులు ఏర్పాటు చేయాలి. అక్రమ పద్ధతిలో (పీవోటీ -1977) చట్టానికి విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అసైన్డ్ భూమిని రెగ్యులరైజ్ చేయవద్దని, 2007లోనే ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. స్వాధీనం చేసుకున్న అసైన్డ్ భూమి చుట్టూ ప్రభుత్వ భూమి అని బోర్డులు, హద్దులు ఏర్పాటు చేయాలి. వీలైతే ఈ భూమిని దళితులు, భూమి లేని పేదలకు ఇవ్వాలి. లేని ఎడల ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించాలి.

Next Story