- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణపై చలి పంజా.. రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్
తెలంగాణలో మళ్లీ కోల్డ్ వేవ్ పుంజుకుంది. రాత్రి, ఉదయం టెంపరేచర్లు గణనీయంగా పడిపోతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మళ్లీ కోల్డ్ వేవ్ పుంజుకుంది. రాత్రి, ఉదయం టెంపరేచర్లు గణనీయంగా పడిపోతున్నాయి. మరో వారంరోజులపాటు రాష్ట్రంలో చలితీవ్రత ఇలాగే ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. డిసెంబర్ 16 వరకూ పవర్ఫుల్ కోల్డ్ వేవ్స్ ఉంటాయని పేర్కొంది. ముఖ్యంగా ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు 6-9 డిగ్రీల టెంపరేచర్లు నమోదవుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పిల్లలు, వృద్ధులపట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. డిసెంబర్ 10, 11, 12, 13 తేదీల్లో చలితీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించింది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో చలిగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వివరించింది. హైదరాబాద్ లో 9-12 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, చలితీవ్రత పెరగనున్న క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.






