- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిద్దిపేటలో దారుణం.. గాలి దుమారానికి కూలిన టోల్ గేటు పై కప్పు..!
సిద్దిపేట జిల్లాలో ( siddipet) దారుణం చోటు చేసుకుంది.. గాలి దుమారానికి టోల్ గేట్ ( Tollgate) పైకప్పు కుప్పకూలింది. సిద్

దిశ, వెబ్ డెస్క్: సిద్దిపేట జిల్లాలో ( siddipet) దారుణం చోటు చేసుకుంది.. గాలి దుమారానికి టోల్ గేట్ ( Tollgate) పైకప్పు కుప్పకూలింది. సిద్దిపేట నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఉన్న టోల్ గేట్ పైకప్పు కూలింది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా దుద్దెడ ( Duddeda Tollget) టోల్ గేట్ వద్ద చోటుచేసుకుంది. ఇవాళ సాయంత్రం ఐదు గంటల నుంచి భారీ స్థాయిలో గాలి దుమారం వచ్చింది.
అదే సమయంలో భారీ వర్షం కూడా కురిసింది. అయితే ఆ గాలి దుమారానికి.. దుద్దెడ టోల్ గేట్ కుప్పకూలింది. ఈ నేపథ్యంలోనే పలు వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. సిగ్నల్ వ్యవస్థ స్తంభించడంతో ఆ టోల్ గేట్ దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే సిద్దిపేట జిల్లా పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది






