- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు.. మెట్రోరైల్ ఎండీగా సర్ఫరాజ్
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ చేసింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు (IAS officers) ఐఏఎస్ అధికారుల బదిలీ చేసింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు (CS Ramakrishna Rao) ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్‌వీఎస్ రెడ్డి నియామకం అయ్యారు. ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారుగా ఆయన రెండేళ్లు పదవిలో కొనసాగనున్నారు. హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్‌ను నియమించారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా శృతి ఓజాను తిరిగి నియమించారు. అలాగే సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ గా కృష్ణ ఆదిత్య.. హెచ్ఎండీఏ సెక్రటరీగా కోటం శ్రీవాత్సకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
Next Story






