- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐలాండ్‌లోని వాచ్ టవర్‌పై రెస్టారెంట్.. అధికారులకు తెలంగాణ మంత్రి ఆదేశం
సింగూరు ప్రాజెక్ట్(Singur Project)ను మంత్రి దామోదర రాజనర్సింహా(Minister Damodara Raja Narasimha) సందర్శించారు.

దిశ, వెబ్‌డెస్క్: సింగూరు ప్రాజెక్ట్(Singur Project)ను మంత్రి దామోదర రాజనర్సింహా(Minister Damodara Raja Narasimha) సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌ను అన్ని హంగులతో తీర్చి దిద్దాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్ట్ ఐలాండ్‌లోని వాచ్ టవర్‌పై రెస్టారెంట్ ఫుడ్‌కోర్ట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. అంతేకాదు.. సింగూరు ప్రాజెక్టులో 50 సీట్ల కెపాసిటీతో బోట్లు, స్పీడ్ బోట్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే సింగూర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్, రోడ్ మ్యాప్‌ను రూపొందించాలని టూరిజం, ఇరిగేషన్, R&B శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఇక సింగూరు ప్రాజెక్టు(Singur Project) దిగువ ప్రాంతంలో కూడా పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి పర్యాటకశాఖ ఆద్వర్యంలో 29 ఎకరాల్లో సుమారు 5 కోట్ల రూపాయలతో రెస్టారెంట్, 25 ఆధునిక కాటేజీల నిర్మాణం, చిల్డ్రన్స్ ప్లే ఏరియా(Children's play area), ఫుడ్ కోర్ట్, గార్డెనింగ్, గ్రీనరీ, ల్యాండ్ స్కేపింగ్, పార్కింగ్ ఉండేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. డ్యాం పైకి వెళ్లడానికి అవసరమైన స్టెప్స్ నిర్మాణం, డ్యాం బండ్ వెంట పార్కు అభివృద్ధి, సైక్లింగ్, వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులకు సూచించారు. కాగా, ఇటీవలే సింగూరు ప్రాజెక్టు పేరును కూడా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ప్రాజెక్టుకు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి, దివంగత కాంగ్రెస్ నాయకుడు రాజనర్సింహ(Raja Narasimha) పేరు పెట్టారు. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉత్తర్వులను సైతం ఇప్పటికే జారీ చేసింది. సింగూరుతో పాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పేరును కూడా మార్చింది. దీనికి కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి(Jaipal Reddy) పేరు పెట్టారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(Palamuru-Rangareddy Lift Irrigation Scheme) ఇక నుంచి.. ఎస్.జైపాల్ రెడ్డిని పీఆర్‌ఎల్‌ఐ ప్రాజెక్టుగా పిలవనున్నారు.






