- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేర్వేరుగానే రెయిన్ వాటర్ డ్రైన్, సీవరేజ్ లైన్లు
కమిషనరేట్ పరిధిలో సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, మున్సిపల్ జోనల్ కమిషనర్ హేమంత్ కలిసి పర్యటించారు.

వేర్వేరుగానే
రెయిన్ వాటర్ డ్రైన్, సీవరేజ్ లైన్లు
సీవరేజ్ ట్రంక్ మెయిన్ లైన్లను నిర్మించాలని నిర్ణయం
సైబరాబాద్ కమిషనర్ సృజనతో కలిసి ఎండీ అశోక్ రెడ్డి పర్యటన
దిశ, తెలంగాణ బ్యూరో : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెయిన్ వాటర్ డ్రెయిన్ లో మురుగు కలవకుండా ట్రంక్ మెయిన్‌ల అభివృద్ధిపై జలమండలి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో సంయుక్త కార్యాచరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం కమిషనరేట్ పరిధిలో సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, మున్సిపల్ జోనల్ కమిషనర్ హేమంత్ కలిసి పర్యటించారు. దుర్గం చెరువు నుంచి ఇబ్రహీమ్ చెరువు ఉన్న ఏ చెరువులోనూ మురుగు చేరకుండా చెరువుల పరిరక్షణ చర్యగా భాగంగా.. మల్కం చెరువు నుంచి నెక్నంపూర్ వరకు బాక్స్ డ్రైన్, సీవరేజ్ ట్రంక్ మెయిన్ ల విస్తరణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో చిత్రపురి కాలనీ ఎస్టీపీ, ఖాజా కుంటా ఎస్టీపీ, నానక్ రామ్ గూడా ఎస్టీపీ, నెక్నంపూర్ లోని ఇబ్రహీమ్ చెరువు వరకు చేపట్టాల్సిన పనులను అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా అధికారులు పలు కీలక ప్రదేశాలను సందర్శించి, ప్రస్తుత మురుగు ప్రవాహ పరిస్థితులు, వాననీటి కాల్వల స్థితి, ట్రంక్ మెయిన్‌ల నిర్మాణ పనుల సాధ్యాసాధ్యాలు వంటి అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ముఖ్యంగా, వర్షాకాలంలో వాననీటి కాల్వల్లోకి మురుగు నీరు కలిసే ప్రాంతాలను గుర్తించి, ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కమిషనరేట్ ఉన్న అన్ని సీవరేజ్ లైన్లను సర్వే చేసి, ఎక్కడెక్కడి నుంచి మురుగు వాననీటి కాల్వల్లోకి చేరుతోందో మ్యాపింగ్ చేయాలని సూచించారు. ఆ ప్రాంతాల్లో ట్రంక్ మెయిన్‌ల నిర్మాణాన్ని ప్రాధాన్యంగా తీసుకుని ప్రతిపాదనలు రూపొందించాలని జలమండలి అధికారులను ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. అన్ని సీవరేజ్ ప్రవాహాలను సమగ్రంగా ఎస్‌టీపీలకు మళ్లించాలని స్పష్టం చేశారు.
ప్రతి చుక్క మురుగు నీరు శుద్ధి కావాలని అధికారులకు ఖచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని స్టార్మ్ వాటర్ డ్రైన్స్ సామర్థ్యాన్ని పెంచడం, సీవరేజ్, వర్షపు నీటి కాల్వలను పూర్తిగా వేరు చేయడం, ట్రంక్ మెయిన్‌లకు అనుసంధానమైన నెట్ వర్క్‌ను ఆధునికీకరించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైన చోట కొత్త పైపులైన్లు ఏర్పాటు చేయడం, పాత లైన్లను మార్పులు చేయడం, మరియు కాల్వల్లో ఎక్కడైనా మురుగు ప్రవాహం కలిసే పరిస్థితులు లేకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయాలని తెలిపారు. దీనికోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ప్రాజెక్టు సీజీఎంలు పద్మజ, సుజాత, సీఎంసీ చీఫ్ ఇంజినీర్ శ్రీలక్ష్మి, ఇరిగేషన్ ఈఈ మల్లేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.






