- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన ట్విస్ట్.. KCR మెయిన్ టార్గెట్ బండి సంజయ్?
ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఫోన్‌నే గత కేసీఆర్(KCR) ప్రభుత్వం ఎక్కువసార్లు ట్యాపింగ్ చేసిందని పోలీసులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కేంద్ర నిఘా వర్గాలు బండి సంజయ్ ముందు పెట్టాయి. రేపు సిట్ ఎదుట హాజరు కాబోతున్న బండి సంజయ్.. తన వద్ద ఉన్న ఆధారాలన్నీ సిట్ ఎదుట సమర్పించనున్నారు. దీంతో ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసును బీజేపీ జాతీయ అంశంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ అధికారులు హైదరాబాద్ వచ్చారని సమాచారం. ప్రస్తుతం బండి సంజయ్‌తో భేటీ అయిన అధికారులు.. ఫోన్ ట్యాపింగ్ అంశంపైనే కీలకంగా చర్చిస్తున్నట్లు సమాచారం.
బండి సంజయ్ షెడ్యూల్ :
కాగా, రేపు ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని తన నివాసం నుండి బయలుదేరి నేరుగా 10.30 గంటలకు ఖైరతాబాద్ చౌరస్తా వద్దనున్న హనుమాన్ టెంపుల్‌ను దర్శించుకుంటారు. అనంతరం ఉదయం 11 గంటలకు అక్కడి నుండి రాజ్ భవన్ సమీపంలోని దిల్ కుశ్ గెస్ట్ హౌజ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు సిట్ విచారణకు హాజరవుతారు. సిట్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడతారు.






