- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kalesawaram Commission : కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో సంచలన నిజాలు.. 50 మందిపై క్రిమినల్ చర్యలు!
కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో జస్టిస్ చంద్ర ఘోష్(Justice Chandra Ghosh) నేతృత్వంలోని విజిలెన్స్ కమిషన్ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో జస్టిస్ చంద్ర ఘోష్(Justice Chandra Ghosh) నేతృత్వంలోని విజిలెన్స్ కమిషన్ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. 2025 ఏప్రిల్‌లో సమర్పించిన నివేదికలో సంచలన విషయాలు బయటపెట్టింది. దాదాపు 50 మంది ఇరిగేషన్ అధికారులపై నిర్మాణంలో నిర్లక్ష్యం, డిజైన్ లోపాలు, అవినీతి ఆరోపణలతో చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్లాక్-7 పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ లోపాలు ఉన్నట్లు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) గుర్తించింది. బ్యారేజ్ స్థల ఎంపిక, డిజైన్ మార్పులు, నాణ్యతా నియంత్రణ లేకపోవడంతో సమస్యలు తలెత్తాయని, ఇంజనీర్-ఇన్-చీఫ్ భూక్యా హరిరామ్ సహా అధికారులు నిర్ణయాల్లో పాల్గొన్నారని తేల్చింది.
రూ.1.47 లక్షల కోట్లు దాటిన ప్రాజెక్టు ఖర్చులో రూ.86,000 కోట్ల రుణాలు, ఏటా రూ.25,000 కోట్ల విద్యుత్ బిల్లులు, రుణ చెల్లింపులతో ఆర్థిక అవకతవకలు జరిగాయని కమిషన్ నివేదికలో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు, సూపరింటెండెంట్ ఇంజనీర్ రమణారెడ్డిపై ఇప్పటికే అభియోగాలు నమోదై, హరిరామ్‌ను ఏసీబీ అరెస్టు చేసింది. అయితే నివేదిక ఇంకా అధికారికంగా విడుదల కాని నేపథ్యంలో కొన్ని వివరాలు ధృవీకరణ కావాల్సి ఉంది.






