పవన్ కల్యాణ్ పెద్ద ఈగోయిస్ట్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |

తెలంగాణలో ప్రచారం చేసినా డిపాజిట్లు కూడా రావని తెలిసే పవన్ కల్యాణ్ తన పర్యటనని రద్దు చేసుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్ చేశారు.

పవన్ కల్యాణ్ పెద్ద ఈగోయిస్ట్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‍పై (Pawan Kalyan) జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy) మరోసారి విమర్శలు గుప్పించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారాని వస్తానని ప్రకటించిన పవన్ కల్యాణ్ ఆ పై తన పర్యటనలను రద్దు చేసుకోవడంపై అనిరుధ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జనసేనకు (Jana Sena Party) ప్రచారం చేసినా డిపాజిట్లు కూడా రావని తెలిసే పవన్ కల్యాణ్ తన పర్యటనను రద్దు చేసుకున్నారని విమర్శించారు. ఇవాళ ఓ న్యూస్ చానల్‍తో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్‍కు ప్రొడ్యూసర్ చంద్రబాబు, కో ప్రొడ్యూసర్ లోకేష్, తెలంగాణకు వచ్చేందుకు కొత్త ప్రొడ్యూసర్ మోడీని వెతుక్కున్నాడని సెటైర్ వేశారు. జనసేన ఆంధ్రా పార్టీ అని అక్కడి నుంచి తెలంగాణకి వచ్చి పెత్తనం చేస్తామంటే ఇక్కడి జనాలు ఊరుకోరన్నారు. ఆంధ్రవారు కేవలం మన దగ్గర ఉన్న భూములు, నిధుల కోసమే వస్తున్నారు తప్ప మనమీద ప్రేమతోకాదన్నారు.

పవన్ క్షమాపణలు చెప్పాల్సిందే:

తెలంగాణ ప్రజల నర దిష్టి వల్లే కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని మా సెంటిమెంట్‍పై మాట్లాడిన పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పమని అడిగినా ఈ రోజుకూ క్షమాపణ చెప్పలేదని పవన్ కల్యాణ్‍కు బాగో ఈగో అని విమర్శించారు. అయినా కొండగట్టుకు వస్తే రాష్ట్ర అతిథిగా గౌరవం ఇచ్చామన్నారు. ఆయన ఓ ఫార్వర్ట్ క్యాస్ట్ కు చెందిన వ్యక్తి అయినా శిలాఫలకం మీద ఆయన పేరు పైన రాసి మా బీసీ బిడ్డ కొండాసురేఖ పేరు కింద పెట్టాం. ఆరోజైనా కనీసం క్షమాపణలు చెప్తాడని అనుకున్నానని కానీ చెప్పలేదన్నారు. కొండగట్టుకు టీటీడీ డబ్బులు ఇస్తే అవి నేనే ఇచ్చానని చెప్పుకుంటున్నాడంటే ఆయన ఎలాంటి మనిషో మీరే అర్థం చేసుకోవాలన్నారు. సినిమాల వరకు పవన్ కల్యాణ్ ఓకే. ఆయన సినిమాలు బాగుంటే మేము కూడా చూస్తాం. కానీ ఇప్పుడు బీజేపీతో పొత్తు అని మాట్లాడాతున్నాడు. ఆయన ఎవరితోనైనా పొత్తులు పెట్టుకోవచ్చు. కానీ తెలంగాణ ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

Next Story