- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో BRS విలీనం: ఎంపీ బండి సెన్సేషనల్ కామెంట్స్
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వేళ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వేళ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం బండి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్ర నేతలను మాజీ సీఎం కేసీఆర్ మచ్చిక చేసుకున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని ఒప్పందం చేసుకున్నారని బండి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ అగ్రిమెంట్‌లో భాగంగానే కేసీఆర్ పదేళ్లలో చేసిన అవినీతిపై దర్యాప్తును కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగనీయడం లేదని ఆరోపించారు. తెలంగాణ దశాబ్ధి వేడుకలకు కేసీఆర్‌ను ఆహ్వానించిన కాంగ్రెస్.. బీజేపీ నేతలను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర ఏంటో దేశమంతా తెలుసని గుర్తు చేశారు. ఇక, రాష్ట్ర అధికారిక చిహ్నాం మార్పుపై స్పందిస్తూ.. స్టేట్ అఫిషియల్ లోగోలో చార్మినార్ ఉండొద్దనేది మా విధానమని.. ఇప్పుడు కూడా అదే మాటకు కట్టుబడి ఉన్నామని బండి స్పష్టం చేశారు. తెలంగాణను పదేళ్లలో కేసీఆర్ అప్పుల కుప్ప చేశారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అదే బాటలో నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో మూడు రోజుల్లో ఎన్నికల ఫలితాలు విడుదలకానున్న వేళ.. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అంటూ బండి చేసిన కామెంట్స్ స్టేట్ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారాయి.






