- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్నెళ్లో.. ఏడాదో.. మళ్లీ కేసీఆరే సీఎం: ఎమ్మెల్యే కడియం సంచలన వ్యాఖ్యలు
by Satheesh |
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా బాధ్యతలు తీసుకోకముందే బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. స్టేషన్ ఘన్

X
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా బాధ్యతలు తీసుకోకముందే బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. స్టేషన్ ఘన్ పూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన కడియం శ్రీహరి నిన్న విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాలేదని ఎవరూ భయపడవలసిన అవసరం లేదని, ఆరు నెలలా.. సంవత్సరమా.. చెప్పలేం కానీ మళ్లీ మన ప్రభుత్వమే రాబోతున్నదని, మన సీఎం కేసీఆరే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పోటీకి పోటాబొటీ మెజార్టీ వచ్చింది. దాన్ని వారు కాపాడుకుంటారో లేదో చూద్దాం. ప్రజలు మార్పు కోరుకున్నారని ప్రజాతీర్పును గౌరవిస్తామన్నారు. కాగా త్వరలోనే కేసీఆర్ సీఎం కాబోతున్నారంటూ కడియం చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.
Next Story






