- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌లో సంచలనం.. ఏకంగా రూ.1.20 కోట్లు స్వాహా!
తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ (Telangana Kabaddi Association)లో నిధుల గోల్‌మాల్ అంశం సంచలనం సృష్టిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ (Telangana Kabaddi Association)లో నిధుల గోల్‌మాల్ అంశం సంచలనం సృష్టిస్తోంది. జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు కేటాయించిన నిధుల్లో రూ.60 లక్షలు సొంత ప్రయోజనాలకు వాడుకున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా జూనియర్ నేషనల్ కబడ్డీ టోర్నమెంట్ నిధుల్లో రూ.1.20 కోట్లు దుర్వినియోగం చేశారని తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ మాజీ కార్యదర్శి సురేశ్ (Suresh).. కోశాధికారి శ్రీరాములు (Sriramulu)పై అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు శ్రీరాములపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. సరేశ్ ఇచ్చిన ఫిర్యాదులో సాట్స్ నిధులను పక్కదారి పట్టించడమే కాకుండా సంఘానికి అధికారిక ఖాతా ఉన్నప్పటికీ మరో అన్అఫీషియల్ అకౌంట్ నుంచి రూ.60 లక్షలు విత్‌డ్రా చేశారని ఆరోపించాడు.
ఇక సూర్యాపేట (Suryapet)లో 2021లో నిర్వహించిన జాతీయ జూనియర్ కబడ్డీ టోర్నీకి కేటాయించిన రూ.1.20 కోట్లను వృథా చేశారని, అందులో రూ.50 లక్షలు వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ (Telangana Premier Kabaddi League) కోసం ఓ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన రూ.20 లక్షలను జిల్లా సంఘాలకు ఇవ్వకుండా సొంతానికి వాడుకున్నారని ఆరోపించారు. ఏజీఎం, ఈసీ సమావేశాలు నిర్వమించకుండా నిధుల విషయంలో శ్రీరాములు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ఫైర్ అయ్యారు. నిధుల దుర్వినియోగంపై జగదీశ్వర్ యాదవ్‌తో పాటు శ్రీరాములును ప్రశ్నించినందుకు తనను బెదిరిస్తూ మహబూబాబాద్ జిల్లా అసోసియేషన్ నుంచి తొలిగించారని తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ మాజీ కార్యదర్శి సురేశ్ ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సురేశ్ కోరారు.






