- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VH: టీఆర్ఎస్‌గా ఉన్న పార్టీని బీఆర్ఎస్‌గా మార్చడానికి అది కూడా ఒక రీజన్
బీఆర్ఎస్(BRS) పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR)పై తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ.హనుమంత రావు(V.Hanumantha Rao) సీరియస్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR)పై తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ.హనుమంత రావు(V.Hanumantha Rao) సీరియస్ కామెంట్స్ చేశారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రగతి భవన్ కట్టించుకొని కేసీఆర్ ఎవరినీ లోపలికి రానివ్వలేదని అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక దానిని ప్రజాభవన్(Praja Bhavan) చేశారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీలోనే కేసీఆర్ గ్రాఫ్ పడిపోయిందని ఎద్దేవా చేశారు. అత్యాశతోనే కేసీఆర్ పార్టీ పేరు మార్చి ప్రజల్లో, పార్టీలో ఆదరణ కోల్పోయారని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. అత్యాశకు పోయి.. పార్టీని మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లకు విస్తరించి తెలంగాణలో దోచుకున్న కోట్లాది రూపాయలను పక్క రాష్ట్రాల్లో ఖర్చు పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. వెంటిలేటర్లకు ఏ పార్టీ పోవాలో ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. సామాజిక కార్యకర్త రాజ లింగమూర్తిని అన్యాయంగా చంపారని మండిపడ్డారు.
అంతకుముందు మరికొంత మంది కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని అన్నారు. అందుకే మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) మీద కేసు వేసిన రాజ లింగమూర్తి(Raja Lingamurthy) హత్య చేశారని అన్నారు. ఈ హత్య వెనుక రాజకీయ కుట్రకోణం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజకీయ హత్యలను ఉపేక్షించమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి(47)ని బుధవారం రాత్రి 7.15 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.






