విత్తన చట్టం రైతులకు ఆమోదయోగ్యంగా లేదు: రైతు కమిషన్​

by Malleboina Mahesh |   (  Updated:2025-12-06 15:50:34  IST  )

కేంద్రం తెస్తున్న విత్తన చట్టం రైతులకు ఆమోదయోగ్యంగా లేదని, మల్టీనేషనల్ విత్తన కంపెనీలు కోసమే అన్నట్లుగా ఉందని రైతు కమిషన్​చైర్మన్​కోదండ రెడ్డి పేర్కొన్నారు.

విత్తన చట్టం రైతులకు ఆమోదయోగ్యంగా లేదు: రైతు కమిషన్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్రం తెస్తున్న విత్తన చట్టం రైతులకు ఆమోదయోగ్యంగా లేదని, మల్టీనేషనల్ విత్తన కంపెనీలు కోసమే అన్నట్లుగా ఉందని రైతు కమిషన్​చైర్మన్​కోదండ రెడ్డి పేర్కొన్నారు. దేశంలోనే విత్తనోత్పత్తి కి తెలంగాణ కేంద్రంగా ఉందని, ప్రపంచదేశాలకు తెలంగాణ విత్తనం ఎగుమతి అవుతుంది కేంద్రం తెస్తున్న విత్తన చట్టంలో మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. తెలంగాణలో విత్తన కంపెనీల తీరు కూడా బాగాలేదని సీడ్స్ కంపెనీలు కూడా వారి లోపాలను సవరించుకోవాలన్నారు. శనివారం రైతు కమిషన్​కార్యాలయంలో సభ్యులు కెవిఎన్​రెడ్డి, రాములు నాయక్, భవాని రెడ్డి కలిసి కేంద్ర విడుదల చేసిన విత్తన చట్టంపై ముసాయిదాపై సమీక్ష నిర్వహించారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుకు నష్టం లేకుండా చట్టం ఉండాలని, దానికి కంపెనీలు కూడా చెబుతున్నాయని ఆర్గనైజర్ల వ్యవస్థతో రైతులకు కంపెనీలకు కూడా నష్టమేనని నిర్ధారణకు వచ్చారు. కానీ లక్షలాది మంది రైతుల వద్దకు నేరుగా కంపెనీ వెళ్లలేని పరిస్థితుల్లో ఈ ఆర్గనైజర్లు వచ్చారని తెలిపారు. నకిలీ విత్తనం విషయంలో రైతులకు నష్ట పరిహారం అందించాలి. కేంద్రం తెస్తున్న చట్టంలో క్లారిటీ లేదు. రైతులు కోర్టులను ఆశ్రయించాలంటే వారికి ఎప్పుడు న్యాయం జరుగుతుందో తెలియని విధంగా ఉందన్నారు. విత్తన కంపెనీలకు అనుమతులు ఇవ్వడం, ధర నిర్ధారణ అంత రాష్ట్ర పరిధిలో ఉండాలని కేంద్రాన్ని కోరారు. ఈనెల 11న వరకు కేంద్రం విత్తన చట్టంపై అభ్యంతరాలకు గడువు ఇచ్చిందని ఇప్పటివరకు రైతులు తమ అభిప్రాయాలు తెలపాలని సూచించారు.

Next Story