- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2029లో మళ్లీ మిమ్మల్ని తొక్కకపోతే చూడు.. అసెంబ్లీలో బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ ధ్వజం
అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అడ్రస్ గల్లంతు చేస్తానని హెచ్చరించారు.

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ‘తొక్కకపోతే చూడు' అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈ రోజు ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. 2009 ఎన్నికల్లో పొత్తు ధర్మంలో భాగంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తాము ఇదే నాటి టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నామని రేవంత్ గుర్తు చేశారు. నాడు పాలమూరులో ప్రతి గల్లీ తిరుగుతూ కేసీఆర్‌ను గెలిపిస్తే.. ఆయన మాత్రం ‘అన్నం పెట్టిన చేతికే సున్నం పెట్టిన’ చరిత్ర కలిగిన వారని మండిపడ్డారు. తాను ఎవరో పెట్టిన భిక్షతోనో, అడుక్కుంటేనో ఈ స్థాయికి రాలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ‘ప్రజాక్షేత్రంలో అలుపెరగని పోరాటం చేసి, బీఆర్ఎస్ పార్టీ నెత్తిమీద కాలు పెట్టి తొక్కి మరీ ఇక్కడిదాకా వచ్చాను. బరాబార్ చెప్తున్నా.. 2029 ఎన్నికల్లో మళ్లీ మిమ్మల్ని తొక్కకపోతే చూడు.. ఇదే నా సవాల్’ అని ధ్వజమెత్తారు. తాను స్వశక్తితో ఎదిగిన వాడినని, తన కాలి గోటికి కూడా విపక్ష నేతలు సరిపోరని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.






