సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ బోగీల పెంపు

by Naga Rani Yarlagadda |

సికింద్రాబాద్- తిరుపతి మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు (నం.20701, 20702) బోగీలను పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.

సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ బోగీల పెంపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సికింద్రాబాద్- తిరుపతి మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు (నం.20701, 20702) బోగీలను పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 14 ఏసీ చైర్ కార్, 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీలతో నడుస్తుండగా.. ఈ నెల 26వ తేదీ నుంచి ఏసీ చైర్ కార్ బోగీలను 18కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో 16 బోగీలను నడిచే ఈ రైలు ఇకపై 20 బోగీలతో నడవనుంది. నిత్యం వేంకటేశ్వర స్వామి దర్శనానికై తిరుపతి వెళ్లే భక్తుల సౌకర్యార్థం పగటి పూట నడిచే ఈ రైలుకు డిమాండ్ భారీగా ఉన్న నేపథ్యంలోనే బోగీలను పెంచినట్లు తెలుస్తోంది.

Next Story