Municipal Results: క్యాంపు రాజకీయాలపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు

by Prasad Jukanti |

తెలంగాణ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు వేళ క్యాంపు రాజకీయాలకు చెక్ పెడుతూ ఎస్ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికైన అభ్యర్థులు తప్పనిసరిగా గెలుపు సర్టిఫికెట్ స్వీకరించి సంతకం చేయాలని స్పష్టం చేసింది.

Municipal Results: క్యాంపు రాజకీయాలపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల (Municipal Elections) ఓట్ల లెక్కింపు వేళ ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెర లేపిన వేళ ఎన్నికల సంఘం (SEC Orders) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికైన అభ్యర్థులకు వెంటనే సర్టిఫికెట్ జారీ చేయాలని, సర్టిఫికెట్ తీసుకున్న అభ్యర్థి సంతకం చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఎన్నికైన అభ్యర్థికి అధికారిక గుర్తింపు పత్రం ఇవ్వాలని కౌంటింగ్ అధికారులకు ఈసీ ఆదేశించింది. కాగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పీఠాలు దక్కించుకోవడమే లక్ష్యంగా కొన్ని చోట్ల కౌంటింగ్‍కు ముందే పార్టీలు తమ తమ అభ్యర్థులను క్యాంపులకు (Camp Politics) తరలించాయి. గతానికి భిన్నంగా కౌంటింగ్ కు ముందే రహస్య ప్రాంతాలకు అభ్యర్థులను తరలించి ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని పార్టీలు ముందస్తు వ్యూహాల్లో భాగంగా శిబిరాలకు తరలించాయి. కానీ ఈసీ మాత్రం క్యాంపు రాజకీయాలకు చెక్ పెడుతూ అభ్యర్థులంతా గెలుపు పత్రాలు తీసుకుని సంతకాలు చేయాల్సిందేననని ఆదేశాలు ఇవ్వడంతో క్యాంపులకు వెళ్లిన వారంతా తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Next Story