- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపే రెండవ విడత పోలింగ్.. కిటకిటలాడుతున్న బస్టాండ్స్
by Muthe.Rajitha |
తెలంగాణాలో రేపు రెండవ విడత పంచాయితీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణాలో రేపు రెండవ విడత పంచాయితీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మొత్తం 4,332 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, 5 చోట్ల నామినేషన్లు లేకపోవడంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు. 415 గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన సర్పంచ్ స్థానాలతో పాటు 29,903 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. కాగా పంచాయితీ ఎన్నికల్లో ఓటేసేందుకు భారీగా ఓటర్లు తమ గ్రామాలకు తరలుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన బస్టాండ్స్ ప్రయాణికులతో, జాతీయ రహదారులన్నీ వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. MGBS, JBS బస్టాండ్స్ తోపాటు ఉప్పల్, ఎల్బీ నగర్ బస్టాపులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసి పోయాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుండగా.. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు జరగనుంది.
Next Story






