ముగిసిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.. 2.5 లక్షల మంది రైతులకు ఆధునిక సాగుపై అవగాహన

by Ramesh Naini |

రాష్ట్ర వ్యవసాయ శాఖ సహకారంతో అగ్రికల్చర్ ​వర్శిటీ గత నెల 27వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది.

ముగిసిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.. 2.5 లక్షల మంది రైతులకు ఆధునిక సాగుపై అవగాహన
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యవసాయ శాఖ సహకారంతో అగ్రికల్చర్​ వర్శిటీ గత నెల 27వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది. 99 రోజుల ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా రఘునాధపాలెం రైతు వేదికగా ప్రారంభించారు. నాలుగు వారాలుగా 32 జిల్లాలలోని 1600 గ్రామాల్లో సుమారు 400 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు, 1000 మంది విద్యార్థులు, సుమారు 600 మంది వ్యవసాయ శాఖ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని 2.50 లక్షల మంది రైతులను కలిసినట్లు వర్సిటీ ఉపకులపతి ప్రొ. అల్దాస్ జానయ్య తెలిపారు. తక్కువ యూరియా వాడి, సాగు ఖర్చు తగ్గించి, నేల ఆరోగ్యాన్ని కాపాడాలని, అవసరం మేరకు రసాయనాలను వాడాలని, పంట మార్పిడి విధానాలని అనుసరించాలని సూచించినట్లు పేర్కొన్నారు.

మార్కెట్‌లో గిరాకీ ఉన్న వరి రకాలనే సాగు చేయాలని, సాగు నీటిని ఆదా చేయాలని, సేంద్రియ సాగు పద్ధతులను పాటించి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించి మానవ ఆరోగ్యాన్ని కాపాడాలనే అంశాలపై రైతులకు అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. నాగర్ కర్నూల్ జిల్లా లోని పదర గ్రామం రైతు వేదికలో ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల ముగింపు కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిధులుగా ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ, వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ విద్యాసాగర్, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ వేణుగోపాల రెడ్డితో పాటు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story