- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో పక్కాగా భద్రతా ప్రమాణాలు పాటించాలి
ప్రైవేట్ స్కూల్ బస్సుల నిర్వహణ, విద్యార్థుల రవాణాపై ఫిట్‌నెస్ నిబంధనలు పాటించని స్కూల్ యాజమాన్యాలు, విద్యాసంస్థలపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.

- పరిమితికి మించి బస్సుల్లో విద్యార్థులను ఎక్కించొద్దు
- నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
- పాఠశాల విద్యాశాఖ ఆదేశం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల బస్సుల నిర్వహణ, విద్యార్థుల రవాణాపై ఫిట్‌నెస్ నిబంధనలు పాటించని పాఠశాలల యాజమాన్యాలు, విద్యాసంస్థలపై ప్రస్తుత చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. అనుమతి లేని వాహనాలను నడపడం, పరిమితికి మించి విద్యార్థులను తరలించడం, లైసెన్స్ లేని, అర్హత లేని డ్రైవర్లను నియమించడంతో పాటు, రవాణా శాఖ అనుమతి లేకుండా బస్సులు నడపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తామని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. తమ పరిధిలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించేలా క్షేత్రస్థాయి అధికారులు పర్యవేక్షించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం నిర్దేశించిన భద్రతా ప్రమాణాలను అన్ని స్కూల్ మేనేజ్మెంట్లు తప్పనిసరిగా, ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్జేడీలు, డీఈఓలు, ఎంఈఓలకు స్పష్టమైన సూచనలు జారీ చేసింది.
పాఠశాలలు పాటించాల్సిన నిబంధనలు
అన్ని ప్రైవేట్ స్కూల్ బస్సులు సంబంధిత రవాణా శాఖ నుండి పొందిన పర్మిట్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను కలిగి ఉండాలి. బస్సులో సీటింగ్ సామర్థ్యానికి మించి ఏ ఒక్క విద్యార్థిని కూడా అదనంగా ఎక్కించకూడదు. కేవలం అర్హత, అనుభవం, సరైన లైసెన్స్ ఉన్న డ్రైవర్లను మాత్రమే స్కూల్ బస్సుల నిర్వహణకు నియమించుకోవాలి. పాఠశాల విద్యార్థుల రవాణాకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన అన్ని చట్టబద్ధమైన భద్రతా చర్యలను ఖచ్చితంగా అమలు చేయాలి.






