మియాపూర్‌లో రోడ్డు ప్రమాదం.. షాకింగ్ వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

మియాపూర్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు ఢీకొని యువకుడు మరణించాడు.

మియాపూర్‌లో రోడ్డు ప్రమాదం.. షాకింగ్ వీడియో వైరల్
X

దిశ‌, వెబ్ డెస్క్: మియాపూర్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు ఢీకొని యువకుడు మరణించాడు. మియాపూర్ పరిధిలోని గోపాల్ నగర్‌లో బ్లడ్ శాంపిల్ తీసుకుని బైక్ పై వస్తుండగా ల్యాబ్ టెక్నీషియన్ నాగరాజును గ్లోబల్ ఎడ్జ్ స్కూల్ బస్సు ఢీ కొట్టింది. మూడు రోడ్డుల కూడలి ఉండగా బస్ డ్రైవర్ హారన్ కొట్టకుండా రావడం, ల్యాబ్ టెక్నీషియన్ సైతం చూసుకోకుండా నేరుగా రోడ్డుపైకి రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు కనిపిస్తోంది.

యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియోలు వేరే వాహనం డాష్ కెమెరాలో రికార్డు కాగా ఆ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఘటనపై తెలంగాణ పోలీసులు సైతం సోషల్ మీడియా ద్వారా స్పందించారు. స్కూల్ పిల్లలను తీసుకెళ్లే బస్సు డ్రైవర్లు ఓపికతో నెమ్మదిగా వాహనాలను నడపాలన్నారు. నిష్ఠాతులైన డ్రైవర్లనే స్కూల్ యాజమాన్యాలు నియమించుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా ఒకసారి తనిఖీ చేసుకోవాలన్నారు. video

Next Story