- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇలా ఉంటేనే సన్నవడ్లకు బోనస్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరిలో సన్నవడ్ల రకాలకు రూ.500 బోనస్ ఇస్తున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరిలో సన్నవడ్ల రకాలకు రూ.500 బోనస్ ఇస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఎన్నికల హామీలో కీలకమైన సన్నవడ్లకు బోనస్ కు ప్రజల్లో విశేష స్పందన లభిస్తోంది. అయితే సన్నవడ్లు పండించినప్పటికీ కొన్ని ప్రమాణాలు పాటించకపోవడం వల్ల కొంతమంది రైతులకు బోనస్ లు జమకావడం లేదు. అయితే ఆ నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వడ్ల గింజ పొడవు, వెడల్పుల నిష్పత్తి వ్యవసాయ అధికారులు ప్రమాణాల ప్రకారం ఉండాలి.
గింజ పొడవు 6mm, వెడల్పు 2mm కంటే ఎక్కువ ఉండాలి. గ్రెయిన్ కాలిపర్ మెషిన్ తో కొలిచినపుడు.. వడ్ల పొడవు, వెడల్పుల నిష్పత్తి 2.5mm కంటే ఎక్కువగా ఉండే ధాన్యానికి ప్రాధాన్యం ఇస్తారు. అయితే విత్తనాల ఎంపికలో జాగ్రత్త పడితే సరైన సన్నవడ్ల దిగుబడి పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ఖరీఫ్ వరిధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అయినా సంగతి తెలిసిందే.






