సంక్రాంతి పండుగ ఎఫెక్ట్.. ఆ టోల్ గేట్ వద్ద భారీ ట్రాఫిక్ జాం

by Ramesh Goud |   (  Updated:2025-01-19 15:12:48  IST  )

సంక్రాంతి పండుగ(Sankranthi Festival) సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లిన వాళ్లు తిరుగు ప్రయాణమయ్యారు.

సంక్రాంతి పండుగ ఎఫెక్ట్.. ఆ టోల్ గేట్ వద్ద భారీ ట్రాఫిక్ జాం
X

దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి పండుగ(Sankranthi Festival) సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లిన వాళ్లు తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై(Hyderabad- Vijayawada Highway) భారీగా ట్రాఫిక్ జాం(Traffic jam) నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి సెలవుల్లో భాగంగా ప్రజలు పట్టణాలను వీడి పల్లె బాట పట్టారు. ఈ సెలవులు ముగియడంతో తిరిగి పట్టణానికి చేరుకుంటున్నారు. దీంతో ప్రధాన రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే చౌటుప్పల్(Choutuppal) పరిధిలోని పంతంగి టోల్ గేట్(Panthangi Toll Gate) వద్ద పెద్ద ఎత్తున వాహనాలు క్యూ కట్టాయి. హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలు బారులు తీరాయి. దీంతో ప్రయాణం నెమ్మదిగా కొనసాగుతోంది. పంతంగి టోల్ గేట్ మీదుగా రోజుకు సగటున 36 వేల వాహనాలు వెళ్లేవని, కానీ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 9 నుంచి రోజుకు సుమారు 70 నుంచి 80 వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయని, సోమ, మంగళవారాల్లో కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉందని టోల్ గేట్ నిర్వాహకులు వెల్లడించారు.

Next Story