- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PMKSYవై కింద ప్రాజెక్టులు మంజూరు చేయండి.. కేంద్ర మంత్రికి రాష్ట్ర ఎంపీల వినతి
ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన పథకం కింద తెలంగాణ పరిధిలోని అన్ని జిల్లాలకు ప్రాజెక్టులు మంజూరే చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు ఇవాళ కేంద్ర గ్రామిణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన పథకం కింద తెలంగాణ పరిధిలోని అన్ని జిల్లాలకు ప్రాజెక్టులు మంజూరే చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు ఇవాళ కేంద్ర గ్రామిణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వారిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ షెట్కర్, రఘురామిరెడ్డి ఉన్నారు. వ్యవసాయ యోగ్యమైన రాష్ట్రంలో నీటిపారుదల, నీటి సంరక్షణ చర్యలు అవసరమన్న ఎంపీలు కేంద్ర మంత్రికి వివరించారు. PMKSY ప్రాజెక్టుల ద్వారా ‘హర్ ఖేత్ కో పానీ’ నిర్ధారించడం, నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, వాటర్ షెడ్ అభివృద్ధి కార్యక్రమాలను బలోపేతం చేయడం లాంటివే లక్ష్యమని అన్నారు.
ఈ ప్రాజెక్టులను సకాలంలో మంజూరు చేసి రాష్ట్ర ప్రయోజనాలకు దోహదపడాలని విజ్ఞప్తి చేశారు. ఇందువల్ల వ్యవసాయ ఉత్పాదకత పెరగడంతో పాటు రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని అన్నారు. స్థిరత్వం లేని రుతుపవనాలతో పడే వర్షాలపై ఆధారపడటం క్రమంగా తగ్గుతుందని వినతిపత్రంలో పేర్కొన్నారు. శాస్త్రీయ నీటి పారుదల పద్ధతుల ద్వారా భూగర్భ జలాలను పరిరక్షించుకోవచ్చని తెలిపారు. స్థిరమైన గ్రామీణ అభివృద్ధితో పాటు జీవనోపాధి భద్రతను ప్రోత్సహించినట్లు అవుతోందని అన్నారు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాబోయే వ్యవసాయ సీజన్లలో రైతులు ప్రయోజనాలను పొందేలా చూడాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు PMKSY కింద ప్రాజెక్టులు మంజూరు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు విజ్క్షప్తి చేశారు.






