- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈటెల, హరీష్ వ్యూహంలో చిక్కిన రాష్ట్ర బీజేపీ.. సంచలన వ్యాఖ్యలు చేసిన సామ రామ్మోహన్ రెడ్డి
తెలంగాణ రాజకీయాలు కాకరేపుతున్నాయి

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొలిటికల్ వార్ ఆసక్తి రేపుతోంది. ప్రధాన పార్టీలన్ని రాబోయే అసెంబ్లీ ఎన్నికల కేంద్రాంగానే తమ భవిష్యత్ కార్యచరణను సిద్ధం చేసుకుంటున్న వేళ టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ సామరామ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హరీశ్ రావు (Harish Rao) చేతికి తెలంగాణ బీజేపీ వెళ్లిపోయిందని, హరీశ్, ఈటల రాజేందర్ (Eatala Rajender) వ్యూహంలో రాష్ట్ర బీజేపీ చిక్కిందని సామ రామ్మోహన్ తాజాగా ఎక్స్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు.
హరీశ్ కార్యక్రమాలకు బీజేపీ ప్రచారం:
హరీశ్ రావు చేతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, బీజేఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలు బొమ్మల్లా మారిపోయారని సామ రామ్మోహన్ రెడ్డి (Sama Rammohan Reddy) ఆరోపించారు. ఇకనుంచి హరీష్ కార్యక్రమాలను కేటీఆర్ కంటే ఎక్కువగా ప్రచారం వచ్చేవిధంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక అని ఆరోపించారు. ఇకపై బీఆర్ఎస్ హరీశ్ రావు కాదని ఆయన బీజేపీ హరీశ్ రావు అంటూ రాసుకొచ్చారు.
త్వరలో సంచలనం తప్పదా?:
సామ ఆరోపణలు ఇలా ఉంటే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. త్వరలోనే స్టేట్ పాలిటిక్స్ లో మరో సరికొత్త రాజకీయ పార్టీ పురుడుపోసుకోబోతోందనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా హరీశ్ రావు, ఈటల రాజేందర్ మరికొంత మంది కలిసి ఇటు బీఆర్ఎస్, ఉద్యమ వాసన కలిగిన నేతలంతా ఏకం కాబోతున్నారనే ఊహాగాలు పొలిటికల్ కారిడార్ లో వినిపిస్తోంది. అయితే ఈ క్రమంలో గత రెండు మూడు రోజులుగా ఈటల, హరీశ్ కొత్త పార్టీ అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న వేళ సామరామ్మోహన్ తాజా ట్వీట్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాలపై ఇటు హరీశ్ రావు, అటు ఈటల ఏ రకంగా స్పందిస్తారో చూడాలి మరి.






