హరీష్ రావు చిల్లర రాజకీయాలు మానుకోవాలి : టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి

by Ajay Maddhiboyina |

సింగరేణిలో ఫీల్డ్ విజిట్ రూల్ ఎప్పటి నుంచో ఉంది..మా ప్రభుత్వమే ఈ రూల్ తెచ్చినట్లుగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది..హరీష్ రావు చిల్లర రాజకీయాలు మానుకోవాలని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి హితవు పలికారు.

హరీష్ రావు చిల్లర రాజకీయాలు మానుకోవాలి : టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : సింగరేణిలో ఫీల్డ్ విజిట్ రూల్ ఎప్పటి నుంచో ఉంది..మా ప్రభుత్వమే ఈ రూల్ తెచ్చినట్లుగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది..హరీష్ రావు చిల్లర రాజకీయాలు మానుకోవాలని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి హితవు పలికారు. బుధవారం ఆయన గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చక్రదర్ గౌడ్ వేసిన పిటీషన్ కు ఇచ్చిన తీర్పును సిట్ విచారణకు ఇచ్చినట్లు గా హరీష్ రావు చెప్తున్నారని, ఒక తప్పుడు సమాచారాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు హరీష్ రావు నుంచి కేటీఆర్ వరకు అందరూ అదే చెప్పారని ఆయన ఆరోపించారు.

ఫోన్ ట్యాపింగ్ లో ఎ1 నుంచి ఎ7 వరకు ఎవరో ఒకరు హరీష్ రావు పేరు చెప్పినందునే ఆయనను విచారణ కు పిలిచారని, ప్రభుత్వంలో ఉండగా తన ఫోన్ ట్యాప్ అవుతుంది..తనతో ఎవరు ఫోన్లో మాట్లాడొద్దని హరీష్ రావు చెప్పినట్లుగా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారని సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తనను సిట్ విచారణ కు పిలిచిందనేది అవాస్తవమని, సృజన్ రెడ్డికి బీఆఆర్ఎస్ హాయాంలో టెండర్ ఎలా వచ్చింది..ఆ ప్రభుత్వంలో టెండర్ల గురించి ఎందుకు మాట్లాడడం లేదని సామ రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సింగరేణి విచారణకు తాము సిద్ధం..కేవలం ఆరోపణలు చేసారనే టెండర్లు రద్దు చేసామన్నారు.

Next Story