కేటీఆర్ మానసిక పరిస్థితి బాగోలేదు: సామా రామ్మోహన్ రెడ్డి

by Ajay Maddhiboyina |

కేటీఆర్ మాన‌సిక ప‌రిస్థితి బాగోలేదని టీపీసీసీ మీడియా అండ్ క‌మ్యూనికేష‌న్ చైర్మ‌న్ సామా రామ్మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. లేదంటే త‌న బావ ఇచ్చిన స్క్రిప్టును గుడ్డిగా చ‌దువుతున్నాడేమోన‌ని అన్నారు.

కేటీఆర్ మానసిక పరిస్థితి బాగోలేదు: సామా రామ్మోహన్ రెడ్డి
X

దిశ‌, వెబ్ డెస్క్: కేటీఆర్ మాన‌సిక ప‌రిస్థితి బాగోలేదని టీపీసీసీ మీడియా అండ్ క‌మ్యూనికేష‌న్ చైర్మ‌న్ సామా రామ్మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. లేదంటే త‌న బావ ఇచ్చిన స్క్రిప్టును గుడ్డిగా చ‌దువుతున్నాడేమోన‌ని అన్నారు. అందులో కుట్ర కోణం ఉండొచ్చ‌ని, కాబ‌ట్టి గుడ్డిగా న‌మ్మి ఆ స్క్రిప్ట్ చ‌ద‌వ‌ద్ద‌ని అన్నారు. కాబ‌ట్టి వాస్త‌వాలను తెలుసుకుని డేటాతో మాట్లాడాల‌ని ఎద్దేవా చేశారు. అలా తెలుసుకుని మాట్లాడితే కొద్దో గొప్పో క్రెడిబిలిటీ ఉంటుంద‌న్నారు.

అంతే కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడవ‌ద్ద‌ని అన్నారు. మీ చెల్లెలు క‌విత మిమ్మ‌ల్ని వీక్ లీడ‌ర్ అంటుంద‌ని, మీరు వీకెండ్ పార్టీలు చేసుకుని వారానికి ఓ సారి వ‌చ్చి చాలెంజ్ చేస్తూ సోషల్ మీడియాలో ఫేక్ ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. నెల రోజులు బీఆర్ఎస్ సోష‌ల్ మీడియాలో ప‌నిచేసేవాళ్లకు డ‌బ్బులివ్వ‌డం ఆపితే కేటీఆర్ నిజ‌స్వ‌రూపం బ‌ట‌య‌కు వ‌స్తుంద‌ని ఆరోపించారు. కేసీఆర్ సీఎంగా ఉన్న‌ప్పుడు రేవంత్ పీసీసీగా ఉండి స‌వాల్ చేశాడ‌ని, కానీ కేటీఆర్‌కు ఏం అర్హ‌త ఉందని ప్ర‌శ్నించారు.

Next Story