- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీడియోలను తొలగిస్తే అంతా అయిపోదు.. వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు: సజ్జనార్ హెచ్చరిక
వ్యూస్, లైక్స్‌తో పాటు సోషల్ మీడియాలో మీరు ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్‌ను పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం అని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రశ్నించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: వ్యూస్, లైక్స్(Views, likes)తో పాటు (Social media) సోషల్ మీడియాలో మీరు ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్‌ను పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం అని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ (Hyderabad City Police Commissioner Sajjanar) ప్రశ్నించారు. ఈ మేరకు వ్యూస్ మాయలో విలువలు మరిచిపోతే ఎలా అంటూ గురువారం ఎక్స్ వేదికగా చిన్నారులను ఓ యూట్యూబర్ (YouTuber) ఇంటర్వ్యూ చేస్తున్న వీడియోలను పోస్ట్ చేశారు. వారితో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అసలు అని సజ్జనార్ నిలదీశారు. చిన్నారులకు, యువతకి స్పూర్తినిచ్చే, ఆదర్శంగా నిలిచే వ్యక్తులను ఇంటర్వ్యూలు చేసి.. సమాజాభివృద్ధికి దోహదం చేయండి.. అంతేకానీ ఇలాంటి వీడియోలు వారితో చేసి పిల్లలను పెడదోవ పట్టించొద్దని సూచించారు. గుర్తుపెట్టుకోండి.. ఇది బాలల హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు.. క్షమార్హం.. చట్టరీత్యా నేరం అని హెచ్చరించారు.
ఇటువంటి చర్యలు POCSO యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ వంటి చట్టాలను ఉల్లంఘించడమేనని వివరించారు. పిల్లలను ఇలాంటి కంటెంట్‌లో భాగం చేయడం చైల్డ్ ఎక్స్‌ప్లాయిటేషనే అవుతుందన్నారు. మైనర్లతో ఈ తరహా కంటెంట్ చేసే వారిపట్ల పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. తక్షణమే వీటిని తొలగించకున్నా.. భవిష్యత్‌లో ఇలాంటి కంటెంట్ అప్లోడ్ చేసిన చట్టప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు మీ దృష్టికి వస్తే వెంటనే రిపోర్ట్ చేయాలని, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండని సూచించారు. హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు కాల్ గానీ, జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండని తెలపారు.
తల్లిదండ్రులుగా మీ బాధ్యత పిల్లలను పెంచడం మాత్రమే కాదు.. వారి బాల్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడటం అనే విషయాన్ని మరచిపోవద్దని హితువు పలికారు. మీ పిల్లలను అనుచిత కంటెంట్ నుండి దూరంగా ఉంచండి.. వారికి సానుకూల వాతావరణం, సరైన విలువలు అందించండని సూచనలు ఇచ్చారు. ఈ క్రమంలోనే సజ్జానార్ పోస్ట్ చేసిన వీడియోలను యూట్యూబర్ ఇంటర్వ్యూ చేసిన వీడియోలను డిలీట్ చేశాడు. అయితే దీనిపై కూడా సజ్జనార్ మరో ట్వీట్ చేస్తూ స్పందించారు. ‘వీడియోలను తొలగిస్తే అంతా అయిపోదు.. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. మైనర్లతో అసభ్యకరంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకోవాలనే మీ ఆలోచన క్షమార్హం కానే కాదు’ అని సజ్జనార్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ట్వీట్ ఇదే..






