ఆన్లైన్ బెట్టింగ్‌కు కానిస్టేబుల్ బలి.. స్పందించిన సజ్జనార్

by Ajay Maddhiboyina |

సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కొఠారి సందీప్ కుమార్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సందీప్ ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్‌కు అలవాటుపడి అప్పులపాలు అవ్వడంతో ఆత్మహత్య చేసున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై సీపీ సజ్జనార్ స్పందించారు.

ఆన్లైన్ బెట్టింగ్‌కు కానిస్టేబుల్ బలి.. స్పందించిన సజ్జనార్
X

దిశ‌, వెబ్ డెస్క్: సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కొఠారి సందీప్ కుమార్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సందీప్ ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్‌కు అలవాటుపడి అప్పులపాలు అవ్వడంతో ఆత్మహత్య చేసున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై సీపీ సజ్జనార్ స్పందించారు. ఆన్ లైన్ బెట్టింగ్ మహామ్మారి అనర్థాలను నలుగురికి అవగాహన కల్పించాల్సిన కానిస్టేబులే.. దానికే వ్యసనపరుడై బలవన్మరణం చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బెట్టింగ్ అనేది ఎంతటి ప్రమాదకారో ఈ ఘటన మనకు స్పష్టం చేస్తోందన్నారు.

జీవితంలో ఒడిదొడుకులు సహజమని, సమస్యకు ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం కాదని పేర్కొన్నారు. కష్ట సమయాలను దైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగలే తప్ప.. చనిపోవాలనే ఆలోచనను మదిలో రానివొద్దని సూచించారు. ఇదిలా ఉంటే సందీప్ తన సోదరితో కలిసి సంగారెడ్డి పట్టణంలో నివాసం ఉంటున్నట్టు తెలుస్తోంది. ఏడాది క్రితం ఉద్యోగంలో చేరగా సందీప్ వయసు కేవలం 23ఏళ్లే. చిన్నవయసులోనే ఉద్యోగం సాధించినప్పటికీ అన్లైన్ గేమ్స్ కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Next Story