తెరుచుకున్న సాగర్ 26 గేట్లు.. నెలకొన్న పర్యాటకుల సందడి

by Yella Dhawani Reddy |

కృష్ణా నది పొంగిపోర్లుతుండటంతో నాగార్జున సాగర్ జలాశయం (Nagarjuna sagar) నిండుకుండలా మారింది.

తెరుచుకున్న సాగర్ 26 గేట్లు.. నెలకొన్న పర్యాటకుల సందడి
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా నది పొంగిపోర్లుతుండటంతో నాగార్జునసాగర్ జలాశయం (Nagarjuna sagar) నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 26 గేట్ల క్ర‌స్ట్ గేట్లను (26 Gates Opened) ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి సాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఇన్‌ఫ్లో 2,56,453 ఉండగా.. ఔట్‌ఫ్లో 2,96,522 క్యూసెక్కులుగా ఉంది. ఇక సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 585.40 అడుగులకు చేరుకుంది. ఇక సాగర్ గేట్లు ఎత్తటంతో ఆ అందాలను తిలకించేందుకు పర్యాటకులు (Tourists) పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా సాగర్ గేట్లు ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో తెరుచుకుంటాయి. కానీ, ఈసారి మహరాష్ట్ర, కర్ణాటక సహా రాష్ట్రంలోనూ భారీ వర్షాలతో జులైలోనే గేట్లు తెరుచుకున్నాయి. అంతేకాదు, 18 ఏళ్ల తర్వాత తొలిసారి చాలా ముందుగానే సాగర్ జలాశయం నిండింది.

Next Story