- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండున్నర లక్షల కోట్లతో సీఎం రేవంత్ ఏం చేశారు? మాజీ మంత్రి సబితా సూటి ప్రశ్న
సీఎం రేవంత్‌రెడ్డి రెండున్నర లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఏమీ చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సూటి ప్రశ్న వేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి రెండున్నర లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఏమీ చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సూటి ప్రశ్న వేశారు. దివ్యాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయలేదని అన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసీఆర్ అప్పులు తెచ్చినా చేసిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తున్నదని చెప్పారు. ఓ కుటుంబ పెద్దలాగా తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశారని చెప్పారు. రేవంత్‌రెడ్డికి మైక్ దొరికితే చాలు కేసీఆర్‌ను తిట్టడం తప్ప చేసిందేమి లేదన్నారు. వికలాంగుల రిజర్వేషన్లు నాలుగు శాతానికి పెంచుతామని అమలు చేయలేదని.. వికలాంగుల సంక్షేమ బోర్డు ఊసే లేదని అన్నారు.
దివ్యాంగులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఇప్పటి వరకు అమలు కాలేదన్నారు. దివ్యాంగుల దినోత్సవాన్ని జరపాలన్న సోయి కూడా ఈ ప్రభుత్వం మరిచిపోయిందని పేర్కొన్నారు. దివ్యాంగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని చెప్పారు. దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ కె.వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో 5 లక్షల 15 వేల మంది దివ్యాంగులకు నెలకు రూ.4 వేల పెన్షన్ వచ్చేదని.. ఇప్పుడు కేవలం 4 లక్షల 90 వేల మందికి మాత్రమే వస్తున్నదని తెలిపారు. 25 వేల మందికి కోత విధించారని పేర్కొన్నారు. మొత్తం ఆసరా పెన్షన్లలో లక్ష మందికి కోత విధించారన్నారు.






