- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: ప్రైవేటు బస్సులను తరిమి కొడతాం
టీజీఎస్ఆర్టీసీలో ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులపై ఆర్టీసీ కార్మికులు పోరాటానికి సిద్ధమయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో: టీజీఎస్ఆర్టీసీలో ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులపై ఆర్టీసీ కార్మికులు పోరాటానికి సిద్ధమయ్యారు. ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్టీసీ తన డిపోలను, విలువైన స్థలాలను అప్పగించడంపై ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. ఆర్టీసీ స్థలాల్లో ఆర్టీసీ బస్సులే ఉండాలని, ప్రైవేటు బస్సులకు స్థానం లేదని మండిపడుతున్నారు. మా జాగా నుంచి ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను తరిమి కొట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తమ భూములు తమకే కావాలనే... డిమాండ్‌తో ఈ నెల 30న ఎలక్ట్రిక్ బస్సుల డిపోల ముందు ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శనలు చేసేందుకు సిద్ధమయ్యారు. విచ్చలవిడిగా ప్రవేట్ ఎలక్ట్రిక్ బస్సులను వేలాదిగా ఆర్టీసీకి బలవంతంగా కట్టబెట్టి ఆర్టీసీ డిపోలు, స్థలాలు కార్పొరేట్ శక్తులకు ధారాధత్తం చేస్తున్న చర్యలకు నిరసనగా 30న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎలక్ట్రిక్ బస్ డిపోల ముందు పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులు గో బ్యాక్ అంటూ అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తామని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.






