మహిళా దినోత్సవం.. ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

ఇంటా బయటా అనేక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న మహిళా సిబ్బంది విధి నిర్వహణలో మాత్రం బాధ్యతాయుతంగా చేస్తున్నారని టీజీఎస్ఆర్టీసీ ఎండి వై.నాగిరెడ్డి అన్నారు.

మహిళా దినోత్సవం.. ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటా బయటా అనేక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న మహిళా సిబ్బంది విధి నిర్వహణలో మాత్రం బాధ్యతాయుతంగా చేస్తున్నారని టీజీఎస్ఆర్టీసీ ఎండి వై.నాగిరెడ్డి అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం బస్ భవన్ లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ తరం మహిళా లోకం ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలను చేరుకుని పురుషులకు తామేమి తీసిపోమని చాటి చెబుతుండటం హర్షించదగ్గ పరిణామమని కొనియాడారు. అవకాశాలు కల్పించడంలో ఆడ,మగ తేడా చూపకూడదని.. స్త్రీ లేకపోతే ఈ సృష్టే లేదని, మహిళలకు మానసిక స్థైర్యం ఎక్కువ అని ఆయన అన్నారు.

ఈ సంస్థ మనది ఆర్టీసీ సంక్షేమం కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని ఎండీ పేర్కొన్నారు. ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్ప కేక్ కట్ చేసి మహిళ ఉద్యోగులకు కేక్ తినిపించారు. అనంతరం మహిళ ఉద్యోగులు ఆమెను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఈడీలు పీవీ మునిశేఖర్, సీహెచ్ వెంకన్న, సీపీఎం ఉషాదేవి, సీటీఎం శ్రీదేవి, సీఈ (ఐటీ) వి.శ్రీదేవి, తదితర మహిళా అధికారులు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.

Next Story