- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషమంగా ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ పరిస్థితి.. ఎంజీఎం నుంచి హైదరాబాద్‌కు తరలింపు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో జరుగుతున్న కాలయాపనను నిరసిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నర్సంపేట డిపో డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్లు సమాచారం.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో జరుగుతున్న కాలయాపనను నిరసిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నర్సంపేట డిపో డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్లు సమాచారం. ప్రభుత్వం తమ హామీలను నెరవేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ (గురువారం) ఇవాళ నర్సంపేట బస్టాండ్ ఎదుట ఆయన పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 70 శాతానికి పైగా కాలిన గాయాలపాలైన శంకర్ గౌడ్‌కు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందించారు. అయితే పరిస్థితి మరింత విషమించడంతో మెరుగైన వైద్యం నిమిత్తం ఆయనను వరంగల్ నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా, శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆర్టీసీ జేఏసీ తీవ్రస్థాయిలో డిమాండ్ చేసింది.
Next Story






