భారీగా నిధులు విడుదల చేసిన తెలంగాణ సర్కార్

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు విద్యుత్ టారిఫ్ సబ్సిడీ కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం భారీ నిధులను మంజూరు చేసింది.

భారీగా నిధులు విడుదల చేసిన తెలంగాణ సర్కార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు విద్యుత్ టారిఫ్ సబ్సిడీ కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం భారీ నిధులను మంజూరు చేసింది. మొత్తం రూ.14,000,00,01,000 మంజూరు చేస్తూ ఇంధన శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంజూరైన ఈ నిధులను టీజీ డిస్కమ్‌లు (టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్) ఏప్రిల్ 2026 నుండి ప్రతి నెలా సమాన వాయిదాల్లో అంటే నెలకు రూ. 1,166.67 కోట్లు చొప్పున క్లెయిమ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అసిస్టెన్స్ టు ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సబ్సిడీ పథకం కింద ఈ నిధులను టీజీ ట్రాన్స్‌కోకు కేటాయించారు. ఈ మొత్తాన్ని ఎస్బీఐ, గన్‌ఫౌండ్రీ శాఖలోని టీజీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ పూల్ అకౌంట్ లో జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Next Story