- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టార్టప్‌ల కోసం రూ.వెయ్యి కోట్లు : IT స్పెషల్ సీఎస్
by Muthe.Rajitha |
తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చింది.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం కోసం ₹1000 కోట్ల ఫండ్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ క్రమంలో రాష్ట్ర IT డిపార్ట్‌మెంట్ స్పెషల్ CS సంజయ్ కుమార్ వివరాలు వెల్లడించారు. కాగా వచ్చే జనవరిలో ఈ ఫండ్ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. తెలంగాణలో స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను బూస్ట్ చేసేందుకు ఈ ఫండ్ ఉపయోగపడుతుందన్నారు. AIపై పనిచేసే స్టార్టప్స్‌పై ఫోకస్ చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణను లీడింగ్ గ్లోబల్ AI హబ్‌గా మార్చడమే తమ లక్ష్యమని CS సంజయ్ కుమార్ చెప్పారు. కాగా ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహకం వల్ల హైదరాబాద్ లో మరిన్ని స్టార్టప్ సంస్థలు నెలకొల్పడమే కాకుండా అనేక ఉద్యోగాలకు అవకాశం ఉంటుందని ఐటీ నిపుణులు చెబుతున్నారు.
Next Story






