విద్యుత్ బాధిత రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

by Ramesh Naini |

విద్యుత్ ఘాతంతో మరణించిన ఇద్దరు రైతుల కుటుంబాలకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) చైర్మన్ డాక్టర్ జస్టిస్ డి. నాగార్జున ప్రత్యేక చొరవతో తక్షణ ఉపశమనం లభించింది.

విద్యుత్ బాధిత రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ ఘాతంతో మరణించిన ఇద్దరు రైతుల కుటుంబాలకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) చైర్మన్ డాక్టర్ జస్టిస్ డి. నాగార్జున ప్రత్యేక చొరవతో తక్షణ ఉపశమనం లభించింది. వికారాబాద్ జిల్లా కేరెల్లికి చెందిన చంద్రారెడ్డి, సిద్దిపేట జిల్లా విశ్వనాథపల్లికి చెందిన నలిగామ కనకయ్య విద్యుత్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోగా, వారికి రావాల్సిన ఎక్స్‌గ్రేషియా అందడంలో జాప్యం జరుగుతోందని కుటుంబ సభ్యులు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన తక్షణమే స్పందించి అధికారులను ఆదేశించడంతో, కేవలం గంటల వ్యవధిలోనే ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా మంజూరైంది. అనంతరం పరిహారం మంజూరు పత్రాలను శనివారం ఈ ఆర్ సీ చైర్మన్ బాధిత కుటుంబాలకు అందజేశారు.

Next Story