గల్ఫ్ బాధితులకు భారీగా ఎక్స్ గ్రేషియా విడుదల

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-03-28 10:37:35  IST  )

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 66 మంది గల్ఫ్ మృతుల వారసులకు రూ.3.30 కోట్ల ఎక్స్ గ్రేషియాను విడుదల చేసినట్లు రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

గల్ఫ్ బాధితులకు భారీగా ఎక్స్ గ్రేషియా విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 66 మంది గల్ఫ్ మృతుల వారసులకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం శుక్రవారం రూ.3.30 కోట్ల ఎక్స్ గ్రేషియాను విడుదల చేసినట్లు బాల్కొండ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేశారని అన్నారు. సీఎం సూచన మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఆర్థిక, ప్రణాళిక) కె. రామకృష్ణారావుతో సమన్వయం చేసి నిధులు విడుదల చేయించినట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 28 మంది, జగిత్యాల 19, కామారెడ్డి 9, నిర్మల్ 7, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో ఒక్కొక్కటి చొప్పున 66 మంది ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు వివరించారు. గతంలో 103 మందికి రూ.5 కోట్ల 15 లక్షలు చెల్లింపు జరిగిందని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 169 మందికి రూ.8 కోట్ల 45 లక్షలు చెల్లింపు జరిగిందని అనిల్ వివరించారు.

Next Story