GHMC Commissioner : జీహెచ్ఎంసీ కమిషనర్‌గా రొనాల్డ్ రోస్

by Disha Web Desk 21 |
GHMC Commissioner : జీహెచ్ఎంసీ కమిషనర్‌గా రొనాల్డ్ రోస్
X

దిశ, సిటీ బ్యూరో: జీహెచ్ఎంసీ కమిషనర్‌గా రోనాల్డ్ రోస్ బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో మాజీ కమిషనర్ లోకేశ్ కుమార్ నుంచి బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఆయన్ను పలువురు కార్పొరేటర్లు, ఉన్నతాధికారులు, ఇంజనీర్లు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్ రోనాల్డ్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ నగరవాసులకు అందిస్తున్న సేవల గురించి, విధుల గురించి తనకు మంచి అవగాహన ఉందన్నారు. అనంతరం మెట్రో రైల్ భవన్ లో జరగనున్న పురపాలక శాఖ వార్షిక నివేదిక విడుదల కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story