- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLC కవితకు అండగా ఉందాం.. బీసీలకు ఆర్.కృష్ణయ్య సంచలన పిలుపు
బీసీ నేత, రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య(R.Krishnaiah) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆర్. కృష్ణయ్యతో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) భేటీ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: బీసీ నేత, రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య(R.Krishnaiah) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆర్. కృష్ణయ్యతో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీల కోసం కవిత ముందుకొచ్చి మాట్లాడుతున్నారు.. ఫైట్ చేస్తున్నారని కొనియాడారు. బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు ఆమెకు మద్దతు ఇవ్వాలని కోరారు. బీసీలు కూడా కవితకు మద్దతివ్వడంతో పాటు.. అండగా ఉండాలని పిలుపునిచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. బీసీలకు 75 ఏళ్లుగా అన్యాయం జరుగుతోంది. వాస్తప పరిస్థితిని అర్ధం చేసుకొని కమిట్మెంట్‌తో పోరాటం చేయకపోతే చాలా ప్రమాదం ఉంది. ఇప్పుడున్న రిజర్వేషన్లు కూడా తగ్గుతాయని హాట్ కామెంట్స్ చేశారు. బీసీ కాకపోయినా కవిత మన కోసం పోరాటం ప్రారంభించారు.. కేవలం మన కోసం పులి మీద స్వారీకి సిద్ధమయ్యారని అన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఆమె చేసే పోరాటాన్ని ఎవరూ తప్పుపట్టొద్దని కోరారు. అందరం ఐక్యంగా ఉద్యమం చేస్తేనే.. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు దిగి వస్తాయని చెప్పారు. జూలై 17న జరిగే జాగృతి రైల్ రోకోకు కచ్చితంగా మద్దతు ఇస్తామని ఎమ్మెల్సీ కవితకు ఆర్.కృష్ణయ్య హామీ ఇచ్చారు.






