R.Krishnaiah: నిరుద్యోగుల మీద ప్రేముంటే ఆ పని చేయు.. రేవంత్ రెడ్డికి ఆర్. కృష్ణయ్య చాలెంజ్

by Prasad Jukanti |

సీఎం రేవంత్ రెడ్డికి ఆర్. కృష్ణయ్య చాలెంజ్ చేశారు.

R.Krishnaiah: నిరుద్యోగుల మీద ప్రేముంటే ఆ పని చేయు.. రేవంత్ రెడ్డికి ఆర్. కృష్ణయ్య చాలెంజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిరుద్యోగుల మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలను నెరవేర్చాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ నేత ఆర్.కృష్ణయ్య (R.Krishnaiah) డిమాండ్ చేశారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తాము 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేమని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోందని ఈ నియామకాలు మీరు ఇచ్చినవేనా లేక గత ప్రభుత్వం ఇచ్చినవా అనే జోలికి నేను వెళ్లనని కానీ ముందున్న ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ ఇందిరాపార్క్ లోని (Indira Park) ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగులు నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి ఆర్.కృష్ణయ్య సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణలో చాలా ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని ఒక్కో అధికారి మూడు నాలుగు జిల్లాలకు ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి కొత్త పోస్టులను క్రియేట్ చేయలేదని విమర్శించారు. ఈ విషయాన్ని మాజీ సీఎస్ సైతం అంగీకరించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) నిజంగా నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే, సమర్థవంతంగా ప్రభుత్వ పాలన అందిచాలనే ఆలోచన ఉంటే ఒక్కో అధికారికి మూడు నాలుగు అదనపు బాధ్యతలు కట్టబెట్టే ఇన్ చార్జీల పరిపాలనకు స్వస్తి చెప్పాలని సవాల్ చేశారు. రాష్ట్రంలోని వివిధ డిపార్ట్ మెంట్లలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. మంత్రులను నడిపినట్లు అధికారులను సైతం ఇన్ చార్జీ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ఓ ఎమ్మెల్యే, ఎంపీ స్థానం ఖాళీ అయితే దాన్ని మూడు నుంచి ఆరు నెలల్లో భర్తీ చేస్తారు. కానీ ఓ అధికారి పోస్టు ఖాళీ అయితే ఎన్ని నెలల్లో భర్తీ చేయాలనే నిబంధనను రాజ్యాంగంలో పొందుపర్చాలని పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిరుద్యోగుల ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపించాలని సూచించారు.

Next Story