- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Revenue Sadassu: భూయజమానులకు గుడ్ న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు
రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు మొదలయ్యాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: భూ సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరించే ఉద్దేశంతో ప్రభుత్వం తలపెట్టిన రెవెన్యూ సదస్సులు (Revenue Sadassu) ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలయ్యాయి. అన్ని రెవెన్యూ గ్రామాలకు తహశీల్దార్ నేతృత్వంలోని బృందం ‘ప్రజల వద్దకే రెవెన్యూ నినాదంతో’ కొత్త రెవెన్యూ చట్టంపై అవగాహన, భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నారు. రెవెన్యూ సేవలను సరళతరం చేయడంతో పాటు భూ సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం ధరణి (Dharani) స్థానంలో భూ భారతి -2025 (Bhubharathi) చట్టాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టంపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజక్టు కింద జిల్లాకో మండలాన్ని ఎంపిక చేసి అవగాహన సదస్సులు నిర్వహించారు. తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో ఇవాళ్టి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. నేటి నుంచి అధికారులు మండలాల్లోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. ఖమ్మం జిల్లాలో రెవెన్యూ సదస్సును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించగా మిగతా జిల్లాల్లో నూ అధికారులు రెవెన్యూ సదస్సులు కొనసాగిస్తున్నారు.






