Revanth Reddy: ఓట్ చోరీ తర్వాత భూమి, రేషన్ కార్డు చోరీలు.. బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |

‘ఓట్‌ చోర్‌-గద్దీ ఛోడ్‌’ పేరు దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ మహా ధర్నా చేపట్టింది.

Revanth Reddy: ఓట్ చోరీ తర్వాత భూమి, రేషన్ కార్డు చోరీలు.. బీజేపీపై  సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ చూస్తోందని గత ఎన్నికల్లో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్లాన్ చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఓట్ చోరీ, ఎస్ఐఆర్ ద్వారా ఎన్నికల్లో అక్రమంగా గెలవాలని బీజేపీ చూస్తోందని ధ్వజమెత్తారు. రాజ్యాంగం ఉంటేనే రిజర్వేషన్లు వంటి అవకాశాలు ఉంటాయన్నారు. 'ఓట్ చోర్-గద్దీ చోడ్' పేరుతో ఢిల్లీ రామ్ లీలా మైదానంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహా ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల సీఎంలు, పార్టీ ఎంపీలు, ముఖ్యనేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు బీజేపీ ఓటు చోరీ చేస్తోందని తర్వాత భూమి, రేషన్ కార్డును తీసేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఈసీ ఓటు చోరీపై రాహుల్ గాంధీ అన్ని ఆధారాలు బయటపెట్టారని రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ప్రజాస్వామ్యం కోసం రాహుల్ గాంధీ పోరాటానికి అందరూ మద్దతుగా నిలవాలని సీఎం పిలుపునిచ్చారు. బీజేపీ ఆదివాసీల హక్కులను కాలరాస్తోందని సీఎం ఆరోపించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు రాహుల్ గాంధీ సైనికుడిగా తెలంగాణ తరఫున తామంతా వచ్చామని మీరంతా సిద్ధమా అని ప్రశ్నించారు.

Next Story