- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్ రెడ్డి స్టాండర్డ్ డైలాగులు మానుకో.. మాజీ మంత్రి హరీశ్ రావు హాట్ కామెంట్స్
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని.. వాస్తవాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు చెబుతామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని.. వాస్తవాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు చెబుతామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పవర్ పాయంట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీలు అవాస్తవాలు చెబుతూ.. బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించిన కాళేశ్వరంపై వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ బనకచర్ల ప్రాజెక్ట్‌కు ప్లాన్ చేస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన తడిగుడ్డ వేసుకుని చూస్తూ కూర్చుందని కామెంట్ చేశారు. ఇదే అంశంపై బీజేపీ కూడా స్పందించడం లేదని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కుప్పకూలిందంటూ స్టాండర్డ్ డైలాగ్ కొడుతున్నాడని అవి మానుకోవాలని అన్నారు. ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలని హితవు పలికారు. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్‌హౌజ్‌లు, 203 కి.మీ సొరంగాలు, 1,531 కి.మీ గ్రావిటీ కెనాల్స్, 98 కి.మీ ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినయోగం కాళేశ్వరం ప్రాజెక్ట్ సమాహారమని తెలిపారు.
ఒక మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్ట్ కూలినట్లుగా చెబుతున్నారని హరీశ్ రావు అన్నారు. మేడిగడ్డ బ్యారేజీని 7 బ్లాకులుగా 85 పిలర్లుగా నిర్మించారని తెలిపారు. తుమ్మడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీరు ఎత్తిపోసేలా మొదట రూపకల్పన చేశారని, అక్కడ నీళ్తు తక్కువ ఉంటాయనే ప్రాజెక్ట్‌ను మేడిగడ్డకు మార్చామని అన్నారు. కాళేశ్వరం లేకుండా పంటలు పండాయని కాంగ్రెస్ చెబుతోందిని.. ప్రాజెక్ట్‌కు 3 వనరులు ద్వారా నీటీ లభ్యత ఉందన్నారు. ఒక్క కాళేశ్వరంతో వేలాది చెవువులు నింపొచ్చని తెలిపారు. యాసంగిలో అవే నీటితో పంటలు పండాయని అన్నారు. మేడిగడ్డ నుంచి మల్లన్న సాగర్‌కు నిర్మించనవి అన్నీ వాడకంలోనే ఉన్నాయని పేర్కొన్నారు.
జలయజ్ఞాన్ని.. ధనయజ్ఞం అన్న ఇదే రేవంత్..
కాళేశ్వరం కింద కాలువల ద్వారానే 90 వేల ఎకరాలకు నీరు వచ్చిందని హరీశ్ రావు అన్నారు. ఇప్పటి వరకు 20.33 లక్షల ఎకరాలకు నీరందించామని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు గోదావరి జిల్లాల్లో 940 టీఎంసీలు కేటాయించారని.. కానీ తెలంగాణ ఆ జలాలను ఏనాడు 400 టీఎంసీలకు మించి వాడుకోదని స్పష్టం చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగేళ్లలో అనుమతులు కూడా సాధించలేదని.. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించకుండానే కాలువల తవ్వకం పనులు మొదలు పెట్టారని గుర్తు చేశారు. అదేవిధంగా సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద రూ.2,328 కోట్లు కాంట్రాక్టర్ల చెల్లించారని అన్నారు. కాంగ్రెస్ చేపట్టిన జలయజ్ఞాన్ని.. ధనయజ్ఞం అంటూ ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి విమర్శించారని హరీశ్ రావు గుర్తు చేశారు.
ఆ సమస్యలు ఉన్న చోట ప్రాణహిత-చేవెళ్ల డిజైన్
2007లో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.17 వేల కోట్లుగా చెప్పారని.. ప్రాజెక్ట్ పనులు ప్రారంభించక ముందే 2011 నాటికి అంచనా వ్యయం రూ.40 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్ట్ నిర్మాణానికి ఒప్పుకునేది లేదంటూ మహారాష్ట్ర సర్కార్ చెప్పిందని అన్నారు. ఏపీ, మహారాష్ట్ర, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నా.. ప్రాణహితకు ఒప్పుకోలేదని అన్నారు. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన 45 రోజులకే మహారాష్ట్రకు వెళ్లి చర్చించి ఒప్పించామని తెలిపారు. ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తే.. తమకు అభ్యతరం ఏం లేదని నాటి మహారాష్ట్ర చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంతర్రాష్ట్ర సమస్యలు ఉన్న చోట ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ డిజైన్ చేసిందని ఆరోపించారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అభ్యతరం చెప్పకుండా మహారాష్ట్రతో చర్చలు జరిపామని అన్నారు. ఇక మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ కట్టొద్దంటూ ఏ ఇంజినీర్ చెప్పలేదని హరీశ్ రావు తెలిపారు.
అలా పూర్తి చేసిన ప్రాజెక్టులు లేవు..
రూ.80 వేల కోట్ల వ్యయంతో రూపొందించి కాళేశ్వరం డీపీఆర్‌కు సీడబ్ల్యూసీ ఆమోదించిందని.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో తెలంగాణలో గోదావరి 312 కి.మీ సజీవంగా ఉండాలే చేశామని తెలిపారు. అంచనా వ్యయం పెరగకుండా పూర్తి చేసిన ప్రాజెక్ట్ దేశంలో ఒక్కటి కూడా లేదన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం రూ.102 కోట్లతో ప్రారంభిస్తే.. వ్యయం రూ.1,183 కోట్లు చేరిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.80 వేల కోట్లు కాగా.. రూ.94 వేల కోట్లకు పెరిగిందని హరీశ్ రావు తెలిపారు.






