- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్ రెడ్డి ఆల్మట్టి ఎత్తు పెంచడాన్ని ఆపాలి: కవిత
మహబూబ్‌నగర్ జిల్లాకు ఆనుకుని ఉన్న కర్నాటకలో ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుతున్నారని, దానిని ఆపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా కవిత మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు.

దిశ,వెబ్ డెస్క్: మహబూబ్‌నగర్ జిల్లాకు ఆనుకుని ఉన్న కర్నాటకలో ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుతున్నారని, దానిని ఆపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా కవిత మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కర్నాటకలో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టు ఎత్తు పెంచకుండా ఆపాలని సూచించారు.
ప్రాజెక్టు ఎత్తు పెరిగితే కృష్ణా కాలువలో క్రికెట్ మ్యాచ్ ఆడుకోవాలని చుక్క నీరు కూడా రాదని చెప్పారు. రైతులు ఇబ్బంది పడతారని అన్నారు. వానలు పడకపోతే నీళ్లు వచ్చే పరిస్థితే లేదని స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ దానిని ఆపాలని చెప్పారు. తెలంగాణ ఉద్యమం సమయంలో జాగృతి అనేక కారక్రమాల్లో పాల్గొన్నట్టు తెలిపారు. ప్రజల సహకారంతో జాగృతిని నిర్మించుకున్నామని దానిని కొనసాగిస్తున్నామని చెప్పారు.






