- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్‍తో రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్? బీజేపీ సంచలన ఆరోపణలు
దావోస్, గ్లోబల్ సమ్మిట్ పెట్టుబడులపై చర్చించే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నిచారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్‍తో రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారా అని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‍రెడ్డి (Alleti Maheshwar Reddy) ప్రశ్నించారు. అందులో భాగంగానే అసెంబ్లీలో కేసీఆర్‍కు (KCR) రేవంత్ రెడ్డి దండాలు పెడుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ అవినీతి కేసులపై చర్యలేవని నిలదీశారు. హిల్ట్ పాలసీపై ఎందుకు చర్చ పెట్టలేదని, దావోస్, గ్లోబల్ సమ్మిట్ పెట్టుబడులపై చర్చించే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని నిలదీశారు. కాగా ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా సభకు సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ హజారయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ సీటు వద్దకే వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆయనతో కరచాలనం చేశారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, ఎమ్మెల్యే నవీన్‌యాదవ్ ఆయనకు పలకరించి అభివాదం చేశారు. సంతాప తీర్మానాల అనంతరం కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు.






